2– 0 వైట్‌వాష్ కొడితేనే లక్ లేకపోతే ఔట్: శ్రీలంక సిరీస్‌లో భారత్ ముందున్న బిగ్ ఛాలెంజ్! 

2– 0 వైట్‌వాష్ కొడితేనే లక్ లేకపోతే ఔట్: శ్రీలంక సిరీస్‌లో భారత్ ముందున్న బిగ్ ఛాలెంజ్! 

WTC Final Race: 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. అయితే ఈసారి ఇది కేవలం ఒక ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసును మార్చేసే అత్యంత కీలకమైన పోరు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న టీమిండియాకు ఇక్కడ ప్రతి మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారింది. మరోవైపు 18 ఏళ్ల పీడకలకు ముగింపు పలకాలని లంకేయులు పట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ఫలితం ఇండియా భవిష్యత్తును ఎలా మార్చబోతోంది. 

డబ్ల్యూటీసీ రేసులో ఎక్కడ ఉన్నాం?:

దక్షిణాఫ్రికాతో జరిగిన గత సిరీస్‌లో 2–0 తేడాతో ఓడిపోవడంతో భారత్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఫైనల్ బెర్త్ రేసులో ముందుండాలంటే శ్రీలంకను వారి సొంత గడ్డపై 2–0తో క్లీన్ స్వీప్ చేయడం ఒక్కటే మార్గం.

రాబోయే కఠినమైన షెడ్యూల్:

ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 2 టెస్టులు, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సుదీర్ఘ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. అందుకే లంకపై విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం టీమిండియాకు ఎంతో అవసరం.

18 ఏళ్ల జయంక్స్ దాటేనా?:

2008లో మురళీధరన్, అజంతా మెండిస్ స్పిన్ మాయాజాలంతో సచిన్, గంగూలీ లాంటి దిగ్గజాలనే తిప్పలు పెట్టి 2–1తో సిరీస్ గెలిచిన శ్రీలంక.. ఆ తర్వాత గత 18 ఏళ్లుగా భారత్‌పై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోయింది. ఈ సారి ఎలాగైనా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని చూస్తోంది. శ్రీలంక మ్యాచ్‌ను సమం చేసినా లేదా గెలిచినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కల తీవ్రంగా దెబ్బతింటుంది.