అంబర్ పేట మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

అంబర్ పేట మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అంబర్‌పేట్‌లోని ప్రసిద్ధ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క అమ్మవారికి ఘనంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాటు పలువురు పోలీస్ అధికారులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సీతక్క బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.