దేవరకొండ, వెలుగు : వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి తీవ్ర గాయాల పాలైన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ పట్టణంలోని 11వ వార్డులోని మగ్దుంబాబా నగర్ లో పానీపూరి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న అరుణ్- సోనాం దంపతుల కుమార్తె నబియా(3) వీధిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు బాలికపై దాడిచేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
