Yukti Thareja: ఇమ్రాన్ హష్మీతో ఒక్క పాట.. ఓవర్‌నైట్ క్రేజ్.. హీరోయిన్ యుక్తి తరేజా ఇంట్రెస్టింగ్ జర్నీ!

Yukti Thareja: ఇమ్రాన్ హష్మీతో ఒక్క పాట.. ఓవర్‌నైట్ క్రేజ్.. హీరోయిన్ యుక్తి తరేజా ఇంట్రెస్టింగ్ జర్నీ!

హర్యానాలో జన్మించిన యుక్తి తరేజా (Yukti Thareja), ఢిల్లీలోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌‌లో వాణిజ్యశాఖలో పట్టా పొందింది. చిన్నప్పటి నుంచే కెమెరా ముందు నిలబడాలనే ఆసక్తి ఉండేది. కాలేజీలో చదువుతున్న రోజుల నుంచే మోడలింగ్‌‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ టైంలోనే ఈ రంగంలో విజయాన్ని సాధించాలంటే అందం కంటే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధన ముఖ్యమని అర్థం చేసుకుంది.

అందం వెనుక ఆత్మవిశ్వాసం

2017లో నిర్వహించిన ‘ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ పోటీలో పాల్గొనడం యుక్తి జీవితంలో తొలి కీలక మలుపు. ఈ పోటీ తర్వాత ప్రకటనలు, ఫ్యాషన్ కార్యక్రమాలు, ఫొటోషూట్లలో అవకాశాలు వరుసగా వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘‘మోడలింగ్ తనకు కేవలం అందాన్ని ప్రదర్శించే వేదిక మాత్రమే కాదని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన అనుభవమ’’ని చెప్పింది. ‘‘కెమెరా ముందు సహజంగా ఉండటం, ప్రతి సందర్భంలో ఆత్మవిశ్వాసంతో కనిపించడం ఈ దశలోనే నేర్చుకున్నాన’’ని వివరించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yukti Thareja (@realyukti)

రియాలిటీ షోతో..

2019లో ఎంటీవీ నిర్వహించిన ‘సూపర్‌‌మోడల్ ఆఫ్ ది ఇయర్’ కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. చివరి దశ వరకు చేరుకుని నాలుగో స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమం తనలోని పోరాట స్ఫూర్తిని మరింత పెంచిందని యుక్తి చెప్తుంది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, పోటీలో ఎలా నిలవాలి, కెమెరా ముందు ఎలా ఆత్మవిశ్వాసంగా ఉండాలి వంటి ఎన్నో విషయాలు అక్కడే నేర్చుకున్నానని ఆమె తెలిపింది. ఈ ప్రోగ్రామ్​ తర్వాతే నటిగా అవకాశాలు రావడం ప్రారంభమైనాయి.

‘లుట్ గయే’తో మారిపోయిన జీవితం

2021లో విడుదలైన ‘లుట్ గయే’ సంగీత వీడియో యుక్తి జీవితంలో అతిపెద్ద మలుపు. ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన ఈ పాట యూట్యూబ్‌‌లో వంద కోట్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఒక్క పాటతోనే ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ వీడియో గురించి మాట్లాడుతూ, ‘‘మొదటి పెద్ద అవకాశం కావడంతో చిత్రీకరణ ప్రారంభానికి ముందు చాలా టెన్షన్​ పడిందని, అయితే ఇమ్రాన్ హష్మీ ఎంతో సహకరించడంతో ఆ భయం త్వరగా పోయింద’’ని చెప్పింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yukti Thareja (@realyukti)

చేజారిన అవకాశం.. నేర్పిన పాఠం

నందమూరి కళ్యాణ్‌‌రామ్ నటించిన ‘డెవిల్’ చిత్రానికి మొదట యుక్తినే కథానాయికగా ఎంపిక చేశారు. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో మరో నటి వచ్చారు. ఈ పరిణామంపై ఆమె “సినీ పరిశ్రమలో ఇలాంటి మార్పులు సహజమని, మన చేతిలో ఉండేది కష్టపడటమేన’’ని ఆమె చెప్పింది. ‘‘ఒక అవకాశం కోల్పోయానని ఆగిపోకుండా, తర్వాతి అవకాశంపై దృష్టి పెట్టడం నేర్చుకున్నాన’’ని తెలిపింది.

ఆడిషన్లే అసలైన పరీక్ష

రియాలిటీ షో ముగిసిన వెంటనే సినిమా అవకాశాలు రాలేదు. ముంబైలో వరుసగా ఆడిషన్లకు హాజరైంది. ‘‘కొన్ని పాత్రలకు చివరి దశ వరకు వెళ్లి కూడా అవకాశం రాకపోవడం బాధ కలిగించేదని, కానీ ప్రతి తిరస్కరణ తనను మరింత బలంగా మార్చిందని చెప్పింది. ఆడిషన్ అనేది నటుడి జీవితంలో ఎప్పటికీ ముగియని ప్రక్రియ అని, ప్రతి అవకాశానికి కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిందేన’’ని ఆమె చెప్పింది. 

ప్రస్తుతం బిజీగా..

ప్రస్తుతం యుక్తి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ‘కే-ర్యాంప్’ చిత్రంలో నటించిన ఆమె, ‘హై జునూన్’ అనే సంగీత నేపథ్య కథా ధారావాహికలో కూడా కనిపించింది. తెలుగు మూవీ ‘కింగ్ జాకీ క్వీన్’తో పాటు కన్నడ నటుడు నిఖిల్ కుమారస్వామి సరసన రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమా అంగీకరించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

మోడల్‌గా ప్రయాణం ప్రారంభించి, రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు చేరువై, ‘లుట్ గయే’ సంగీత వీడియోతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించి, ఆ తర్వాత తెలుగు, మలయాళ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న నటి యుక్తి తరేజా. తన జర్నీలోని ఇంట్రెస్టింగ్​ విశేషాలివి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hasya Movies (@hasyamovies)

తెలుగు తెరపై తొలి అడుగు

‘లుట్ గయే’ తర్వాత దక్షిణాది చిత్రసీమ నుంచి అవకాశాలు రావడం మొదలైంది. 2023లో నాగశౌర్య సరసన ‘రంగబలి’ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ‘‘భాష తెలియకపోయినా ప్రతి డైలాగ్​ను ప్రాక్టీస్ చేసి, పాత్రలోని భావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నటించాన’’ని ఆమె చెప్పింది. కొత్త భాషలో నటించడం సవాలుగా అనిపించినా, అదే తనలో నటిగా మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yukti Thareja (@realyukti)

మలయాళంలో.. మరో మైలురాయి

ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నటించిన ‘మార్కో’ చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఆమెకు మరో ముఖ్యమైన అవకాశం అయింది. ‘‘వేర్వేరు భాషల్లో పనిచేయడం వల్ల నటిగా మరింత నేర్చుకునే అవకాశం లభించిందని, ప్రతి చిత్ర పరిశ్రమకు తనదైన పని సంస్కృతి ఉంటుందని, వాటిని అర్థం చేసుకోవడం కూడా తన ప్రయాణంలో భాగమేన’’ని యుక్తి చెప్పింది.