బేలా ముత్యాలమ్మ ఆయంలో మంత్రి వివేక్ దంపతుల పూజలు

బేలా ముత్యాలమ్మ ఆయంలో మంత్రి వివేక్ దంపతుల  పూజలు

తెలంగాణలో ఆషాడ మాస బోనాల పండుగ సంబురాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం నంబనటటా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే చారిత్రక బేలా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి వివేక్ దంపతులు దర్శించుకున్నారు.

పవిత్ర బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా మంత్రి వివేక్ దంపతులు అమ్మవారికి ఘనంగా పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎల్ నినో ఎఫెక్ట్ నుంచి కాపాడాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. అమ్మవారు భక్తుల కోరికలన్నీ తీరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన ఆయన.. ప్రజా ప్రభుత్వంపై ఎప్పుడూ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.