సీఎస్ఐఆర్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఐఎంఎంటీ) అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 41.
విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 12, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 2, డిప్లొమా ఇంజినీరింగ్ 13, ఐటీఐ ట్రేడ్స్ 14.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 17.
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.immt.res.inను సందర్శించండి.
