వర్షం నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన ..కామారెడ్డిలో ఎప్పుడు వర్షం కురిసిన రాకపోకలకు అంతరాయం

వర్షం నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన ..కామారెడ్డిలో ఎప్పుడు వర్షం కురిసిన రాకపోకలకు అంతరాయం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్​రోడ్డులో ఎప్పుడు వర్షం కురిసినా మెయిన్​రోడ్డుపై వర్షం నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వానకు నీరు నిలవడంతో కౌన్సిలర్‌‌‌‌ గెరిగంటి లక్ష్మీనారాయణ శనివారం ఆ నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌ వెళ్లేవారితోపాటు జిల్లా హాస్పిటల్‌‌, టౌన్‌‌లోని ప్రధాన ఏరియాలకు వెళ్లేవారు ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుందని, రోడ్డుపై నీరు నిలుస్తున్నా   అధికారులు పట్టించుకోవట్లేదని కౌన్సిలర్ వాపోయారు. సమస్యను పరిష్కరించకుంటే దీక్ష చేపడుతానని కౌన్సిలర్​ హెచ్చరించారు.