సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మూడు మిల్లులపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో రూ.57.59కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు గుర్తించారు. హుజూర్‌నగర్ శృతి మిల్లులో 2024–-25 సీజన్‌కు సంబంధించి రూ. 13.65 కోట్ల విలువైన 5,717 టన్నులు, 2022–23 సీజన్‌కు చెందిన రూ. 4.77 కోట్ల విలువైన 2వేల టన్నుల వడ్లు మాయమైనట్లు గుర్తించారు. గరిడేపల్లిలోని సునంద రైస్ మిల్లులో 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు మాయం కాగా వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 26.27 కోట్లు ఉంటుందని అధికారుల
అంచనా. మునగాల మండలం కొక్కిరేణికి చెందిన లక్ష్మీ వెంకటేశ్వర మిల్లులో రూ. 12.90 కోట్ల విలువ చేసే 5,400 టన్నుల ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మూడు మిల్లుల ఓనర్లపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.
