Rohit Sharma: 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి భారత జట్టు ప్రణాళికల్లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఉంటాడా లేదా అనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వయస్సు, ఫిట్‌నెస్‌ను సాకుగా చూపిస్తూ సెలెక్టర్లు రోహిత్ స్థానంలో కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నారనే వార్తలపై మాజీ ఆటగాడు అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్రంగా తప్పుబట్టాడు. హిట్ మ్యాన్ స్థాయి ప్లేయర్ కి బీసీసీఐ పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరాడు.
లార్డ్స్ సెంచరీతో రూమర్లకు చెక్:
ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 137 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్‌కు ముందే బీసీసీఐ సెలెక్టర్లు ఇక చాలు.. వేరే ప్లేయర్ల వైపు చూస్తున్నాం అని రోహిత్‌కు చెప్పేశారని ఊహాగానాలు వచ్చాయి.. కానీ, హిట్ మ్యాన్ తన బ్యాట్‌తోనే వాటన్నింటికీ సమాధానం ఇచ్చాడు.
రోహిత్ మైండ్ ఫ్రీగా ఉంటేనే రన్స్ వస్తాయి:
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడుతూ.. 2027 వరల్డ్ కప్ ఆడుతున్నావని రోహిత్ శర్మకు బీసీసీఐ ఇప్పుడే నేరుగా చెప్పేయాలి.. ఇన్ని సంవత్సరాలుగా జట్టుకు అతను అందించిన సేవలు అపారమైనవి.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో రోహిత్ లాంటి సీనియర్ అనుభవం జట్టుకు ఎంతో అవసరమన్నాడు. రోహిత్ శర్మ స్థాయి ఆటగాడిని ప్రతి సిరీస్‌కు అసెస్ చేయడం సరికాదు.. క్రికెట్ అనేది మైండ్ గేమ్, రిథమ్‌పై ఆధారపడి ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆటగాడు స్వేచ్ఛగా రాణించగలడు. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ మధ్య ఈ చర్చే రాకూడదు.. రోహిత్‌కి 2027 వరల్డ్ కప్ కచ్చితంగా ఆడాలని రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ ఇటీవలి ఫామ్:
* 120+ పరుగులు 2 సార్లు అద్భుత సెంచరీలు
* 70+ పరుగులు 4 సార్లు కీలక హాఫ్ సెంచరీలు
* లేటెస్ట్ హైలైట్ ఇంగ్లాండ్‌పై లార్డ్స్ మైదానంలో 137 పరుగులు
