మల్కాజ్గిరి, వెలుగు: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కిరాణా షాపుల ముసుగులో సాగుతున్న మద్యం దందాపై ఎస్‌ఓటీ బృందాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. ఈ నెల 6, 7 తేదీల్లో ఉప్పల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్, ఎల్‌బీనగర్ జోన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు చేపట్టాయి. రెండు రోజుల్లో మొత్తం 31 కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశారు. రూ.2.76 లక్షల విలువైన 345.99 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.
