రెట్టింపు చేస్తామని డబ్బులు తీసుకొని మోసం.. హైదరాబాద్ లో ఘటన

రెట్టింపు చేస్తామని డబ్బులు తీసుకొని మోసం.. హైదరాబాద్ లో ఘటన
  •    మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం, వెలుగు: డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగివ్వకుండా వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్​బాలాపూర్​మండలం కుర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడకు చెందిన నామని భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(43) ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వార్డ్ బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు.

 వెన్ను నొప్పి ఉందని 15 రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఐరన్ పైపుకు ఉరేసుకున్నాడు. గడియ పెట్టి ఉండడంతో కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా భాస్కర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మహిత, లవకుమార్ ద్వారా కాలరాజు అనే వ్యక్తి భాస్కర్ నుంచి రూ. 17 లక్షలు వసూలు చేశారు. అనిల్ అనే మరో వ్యక్తి రూ. 4.30లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధించాడు. 

కష్టపడి సంపాదించిన రూ. 21.30 లక్షలు తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భాస్కర్ తన సూసైడ్ నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు. తన మరణానికి ఈ నలుగురే కారణమని రాశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ తెలిపారు.