- పరిస్థితి విషమం
పరిగి, వెలుగు: ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. వికారాబాద్‌జిల్లా దోమ మండలం మోత్కూర్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం మోత్కూర్లో గోపాల్ ఇంటికి గునిగారి నర్సింహులు, శ్రీనివాస్వెళ్లారు. గోపాల్‌ను ఇంట్లో నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చారు.
వెదురు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు పరిగి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఉస్మానియా దవాఖానకు తరలించారు. గోపాల్‌పై దాడి చేసిన వారిలో ఆర్మీ జవాన్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
