కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తారా..? కూకట్పల్లి KFC లో పెద్ద గొడవ

కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తారా..? కూకట్పల్లి KFC లో పెద్ద గొడవ

ఇప్పుడున్న ట్రెండ్ లో బయట తినటం కామన్ అయిపోయింది. ఇంట్లో వండినా వండకపోయినా.. బయటి రుచులు అప్పుడప్పుడు టేస్ట్ చేయాల్సిందే. అందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా హైదరాబాదీలు వెనకడారు. కానీ.. హోటల్స్, ఫుడ్ స్టోర్స్ నిర్వహకులు కస్టమర్స్ ఆరోగ్యానికి ఏమాత్రం విలువ ఇవ్వటం లేదు. రేట్లలో ఎక్కడా తగ్గని నిర్వాహులు.. క్వాలిటీ విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. కూకట్ పల్లి KFC లో కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేయడమే అందుకు ఉదాహరణ.

హైదరాబాద్ కూకట్ పల్లి కేఎఫ్సీలో శనివారం (ఫిబ్రవరి 28) కస్టమర్లు గొడవకు దిగారు. అశోక వన్ మాల్ KFC లో కుళ్ళిపోయిన చికెన్ ఇచ్చారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. KFC స్టోర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. కస్టమర్లు వీడియో తీస్తుండటంతో సిబ్బంది అక్కడ ఉండకుండా తప్పించుకుపోవటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

ఫ్రెండ్స్ తో కలిసి స్టోర్ కు వెళ్లిన కస్టర్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. సర్వ్ చేసిన చికెన్ కుళ్ళిపోయి ఉండటంతో చాలా ఇబ్బందికి గురయ్యారు. వాసన వస్తున్న ఫుడ్ ఎలా పెడుతున్నారంటూ కస్టమర్లు నిర్వాహకులను ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లెయింట్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న KFC పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.