- మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్ప్రాంతాల గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం(ఆగస్టు 9న) సందర్భంగా శనివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆధునిక ప్రభుత్వాలు తమ పాలనలో ఆదివాసీల హక్కులను, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశాయన్నారు.
ఇప్పటికైనా పాలకులు తమ విధానాలను సమీక్షించుకుని, ఆదివాసీల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. యువతకు ఆచరణ యెగ్యమైన విధానాన్ని అవలంభించకపోతే గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు తప్పవని హెచ్చారించారు.తెలుగు రాష్ట్రాల్లో పాలకులు రాజ్యాంగంలోని 5వ షెడ్యూలును, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల హక్కులను, భూమిని, సంస్కృతిని కాపాడాలన్నారు.
