ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దానికి అనుబంధంగా వచ్చే ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ఫోటోలు, వీడియోలు అనేక సందర్భాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరి రూపాన్నైనా, ఎవరి స్వరాన్నైనా కృత్రిమంగా మలచడం ఇప్పుడు చాలా సులభమైంది.
అంతెందుకు..? AI రూపొందించిన కంటెంట్‌ను చూస్తుంటే అసలు ఏది? నకిలీ ఏది? అనే తేడాను గుర్తించడం కూడా కష్టంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని క్లిప్స్ నిజంగా జరిగాయా లేదా పూర్తిగా సాంకేతికంగా సృష్టించబడినవా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్గా AI ద్వారా రూపొందించిన ఓ వీడియో సినీ అభిమానులు, నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన మరోసారి టెక్నాలజీ వినియోగంపై జాగ్రత్త అవసరాన్ని గుర్తు చేస్తోంది.
మహేష్-రాజమౌళిపై AI వీడియో:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తూ ఉండగా, సినిమా రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి మధ్య ఫైట్ సీన్‌ను చూపిస్తూ రూపొందించిన ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ “సినిమా చనిపోయింది” (Cinema is Dead) అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
AI ఫైట్ వీడియో- ఎందుకు క్రియేట్ అయింది?
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ఎపిక్ అడ్వెంచర్స్ మూవీ వారణాసి (VARANASI). ఈ మూవీ రిలీజ్ డేట్ని మేకర్స్ మరోసారి ప్రకటించిన అనంతరం, అభిమానులు సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ ఎడిట్స్, AI విజువల్స్‌ను షేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మహేష్ బాబు–రాజమౌళి ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లుగా చూపించే AI వీడియో ఒకటి వైరల్ అయింది.
►ALSO READ | Nani Odela: నన్ను నమ్మింది నువ్వే అన్నా.. జీవితమంతా రుణపడి ఉంటా: నానికి ఓదెల ఎమోషనల్ పోస్ట్
ఆ వీడియోలో ఇద్దరూ గోడలకు, టేబుళ్లకు ఒకరినొకరు తోసుకుంటూ ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. ఇది పూర్తిగా కృత్రిమంగా రూపొందించిన వీడియో అయినప్పటికీ, దాని విజువల్ రియలిజం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కథా నేపథ్యం లేకుండానే రూపొందించిన ఈ క్లిప్‌పై సినీ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్జీవీ స్పందనతో ముదిరిన చర్చ..
ఈ వీడియోను తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ “Cinema is Dead” అని క్యాప్షన్ పెట్టారు. ఆయన వ్యాఖ్యతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు AI టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది సినిమాకి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దానికి అనుబంధంగా వచ్చే ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ఫోటోలు, వీడియోలు అనేక సందర్భాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరి రూపాన్నైనా, ఎవరి స్వరాన్నైనా కృత్రిమంగా మలచడం ఇప్పుడు చాలా సులభమైంది.
‘వారణాసి’పై పెరిగిన అంచనాలు..
‘వారణాసి’ చిత్రంపై మరోసారి భారీ హైప్ పెరిగింది. గుంటూరులోని మైత్రీ సినిమాస్ థియేటర్‌లో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో కనిపించే డిజిటల్ పోస్టర్ ప్రదర్శించబడటం ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తించింది. ఇది అధికారిక ప్రమోషన్‌లో భాగమా లేదా అనేది స్పష్టత రాలేదు కానీ, చిత్రంలోని మైథలాజికల్ ఎలిమెంట్స్‌పై చర్చలు మొదలయ్యాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి, ఏఐ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సినిమా రంగంలో టెక్నాలజీ వినియోగంపై పెద్ద చర్చకు దారి తీసింది.
పురాణాల టచ్‌తో రాజమౌళి ‘వారణాసి’..
రాజమౌళి విజన్ ప్రకారం, 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారనేది టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే బయటకు వచ్చిన రుద్రుడు, శ్రీరాముడి లుక్స్‌తో పాటు, ఇంకా మూడు సరికొత్త రూపాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ‘కుంభ’ అనే శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇతిహాస గాథ రామాయణంలో కుంభకర్ణుడి కుమారుల్లో ‘కుంభుడు’ ఒకరు. రామ-రావణ యుద్ధంలో రాముడిపై పోరాడి హనుమంతుడి చేతిలో మరణించిన పరాక్రమవంతుడిగా ఆయన ప్రస్తావన ఉంది. అలాగే, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మహా శివ భక్తుడి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ‘మందాకిని’ అనేది శివుడి జటాలో ప్రవహించే గంగకు మరో పేరు. ఈ పేరుతోనే ఆమె పాత్రలో పురాణ సింబాలిజం స్పష్టమవుతోంది.
