చంచల్ గూడ–సంతోష్ నగర్ రూట్లో వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే

చంచల్ గూడ–సంతోష్ నగర్ రూట్లో వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్.. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. ఓపెనింగ్ ఎప్పుడంటే

మలక్ పేట్, చంచల్ గూడ, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, ఒవైసీ రూట్లలో వెళ్లే వాహనదారుల కష్టాలు దాదాపు తీరినట్లే. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ జామ్ తో అలసిపోయిన స్థానికుల కష్టాలు తీరే ముచ్చట చెప్పారు అధికారులు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఓపెనింగే మిగిలి ఉందని శనివారం (జులై 18) మీడియాతో తెలిపారు.

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా అధికారులు పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు.  ఆగస్టు నెలలో బ్రిడ్జిని ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు. బ్రిడ్జి పనులను జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

స్టీల్ గిర్డర్లు, డెక్ స్లాబ్, రోడ్డు లేయర్ పనులు దాదాపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. తుది దశలో లైటింగ్, రైలింగ్, రోడ్డు మార్కింగ్ పనులు ఉన్నట్లు చెప్పారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. 3.3 కిలోమీటర్లున్న స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో సైదాబాద్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్ వైపు ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

ALSO READ : హైదరాబాద్ లో నకిలీ ఎరువుల గుట్టురట్టు... 

దీంతో పాటు ఎల్బీనగర్–చార్మినార్ కారిడార్‌లో ప్రయాణ సమయం తగ్గనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సౌత్ సిటీ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ స్టీల్ బ్రిడ్జి కీలకంగా మారనుందన్న చీఫ్ ఇంజనీర్ తెలిపారు.