అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ, గద్దరన్నతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ, గద్దరన్నలతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం  గద్దరన్నను ఎర్రటి ఎండలో కూర్చోబెట్టింని.. గద్దరన్నను అవమానించిన రోజే దొరల గడీలను బద్ధలు కొట్టాలని ప్రజలు నిర్ణయించారని అన్నారు. శనివారం (జులై 18) కవి అందెశ్రీ  జయంతి సందర్భంగా ఘట్ కేసర్ లో ఆయన స్మృతి వనానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ కామెంట్స్:

  • ఒక మిత్రుడి ఇంటిలో అందెశ్రీని కలిశా
  • అందెశ్రీ నాకు ఆత్మబంధువుగా మారాడు, కుటుంబ సభ్యుడు అయ్యాడు
  • అందెశ్రీ నాకు పెద్దన్న.. అందెశ్రీ నాకు స్ఫూర్తి
  • అందశ్రీ ఎప్పుడూ దొరల గడీల ముందు నిలబడలేదు
  • అందెశ్రీ పదాలపై పదాలు పేర్చి జయ జయహే తెలంగాణ గీతం రచించారు
  • అందెశ్రీ పాటలు లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చాయి
  • తెలంగాణ యువత మర ఫిరంగులు కావడానికి అందెశ్రీ పాటలే కారణం
  • అందెశ్రీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
  • అందెశ్రీ పాట, పదాలను నిర్మూలించాలని చూశారు
  • దొరల గడీల ముందు నిలబడనని ధైర్యంగా చెప్పిన కవి అందశ్రీ
  • తెలంగాణ ఉద్యమకారులను మా ప్రభుత్వం గౌరవిస్తోంది
  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నాం
  • నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వరుస నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నం
  • 67 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
  • గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులే లాభపడ్డారు
  • నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలే
  • పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేదు
  • కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు
  •  ఓ పక్క నోటిఫికేషన్  వేయడం.. మరో పక్క బటానీలుగా ప్రశ్న పత్రాలు లీక్ చేసిన ఘనత కేసీఆర్ దే  
  • దిల్ సుక్ నగర్, అమీర్ పేట, అశోక్ నగర్ లో పిల్లలు ఏండ్ల తరబడి కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
  • ఎల్ బీ స్టేడియం, శిల్పా రామారం సాక్షిగా యువతకు ఉద్యోగాలు ఇచ్చాము
  • కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఫామ్ హౌస్ లే.
  • ఎర్రవెల్లిలో 100 ఎకరాల ఫామ్ హౌస్,
  • శంకర్ పల్లిలో 15 ఎకరాల ఫామ్ హౌస్,
  • జన్వాడలో కేటీఆర్ కి 59 ఎకలరాల ఫామ్ హౌస్,
  • హరీష్ రావు కి 50 ఎకరాల్లో ఫామ్ హౌస్  లు ఉన్నాయి.
  • అమెరికాలో బాత్ రూమ్ లు కడుక్కునే కేటీఆర్.. 
  • బతుకమ్మ పేరుతో పైసలు వసూలు చేసిన కవిత.. 
  • కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి ముందు లబ్బరు చెప్పులతో నిలుచున్న హరీష్ రావు 
  • మీ చరిత్ర మీరు  మరిచి పోతున్నారు బిడ్డ 
  • నాకు గద్దర్, అందే శ్రీ స్పూర్తి.. మరి కేసీఆర్.. నీకు నిజాం, రజ్వీ స్ఫూర్తి నా.. 
  • చర్చకు రావు, అసెంబ్లీకి రావు, మళ్ళీ కుట్రలు మాత్రం రోజు చేస్తున్నావ్ కేసీఆర్..