హైదరాబాద్ లో నకిలీ ఎరువుల దందా గుట్టు రట్టయ్యింది.శనివారం ( జులై 18 ) హుజూర్ నగర్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నకిలీ ఎరువుల తీగ లాగితే డొంక కదిలింది. అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇటీవల మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయం వెలుగులోకి రావడంతో హుజూర్‌నగర్ సీఐ జి. చరమందరాజు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
పెద్ద అంబర్‌పేట్‌లోని హరితహారం కాలనీలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రాల గుర్తించారు పోలీసులు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ ఎరువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ALSO READ : డ్రగ్స్కు బదులు నిద్రమాత్రలు, దగ్గు సిరప్లు..
దాదాపు రూ.2 కోట్ల విలువైన నకిలీ ఎరువులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పెద్ద అంబర్‌పేట్ కేంద్రంగా పలు జిల్లాలకు నకిలీ ఎరువుల సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
