మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లాలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్​ణ.  విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  శనివారం (జులై 18) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు. 

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎంపీ చెప్పారు. స్కూల్లో బెంచులు లేక తీవ్ర ఇబ్బందులు పడటం  బాధ కలిగించిందన్నారు.  అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాతకాకా వెంకటస్వామి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పారని చెప్పారు. 

గూడెం స్కూల్ కు బెంచీలు అందిస్తామని..  విద్యార్థులు ఎవరు ఇబ్బందులు పడొద్దని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.

గూడెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుంటే కొందరు కాంగ్రెస్ లీడర్లు అడ్డుకునే ప్రయత్నం చేయడం  బాధ కలిగించిందని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ అందరం అభివృద్ధి కోసమే కలిసి పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. అయినా తనకేం పట్టింపులు లేవని.. అందరం ప్రజల కోసమే కలిసి పనిచేయాలని తన కోరిక అని అన్నారు.