వారానికో రెండు రోజులు రాత్రి భోజనం 7 గంటల నుంచి 7.30 లోపు తింటే ఏమైతదంటే..

వారానికో రెండు రోజులు రాత్రి భోజనం 7 గంటల నుంచి 7.30 లోపు తింటే ఏమైతదంటే..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అద్భుతాలు చేయనక్కర్లేదు. కాస్తంత లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా సంతోషంగా జీవించవచ్చు. డైలీ రొటీన్ పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మార్చుకోవాల్సింది భోజనం తినాల్సిన సమయం.

వారానికి రెండు మూడు రోజులు రాత్రి 7 గంటల నుంచి -7:30 లోపు నైట్ డిన్నర్ ముగించేలా టార్గెట్ పెట్టుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న మార్పు కూడా చాలా మార్పులు తీసుకొస్తుందని.. శరీరంలో జరిగే మార్పులను నమ్మలేరని న్యూట్రిషనిస్టులు తెలిపారు.

కూరగాయల కిచిడీ, వేయించిన కూరగాయలతో పప్పు సూప్, లేదా ఇవి రెండూ కుదరకపోతే ఆకుకూరతో పాటు ఒక జొన్న రొట్టె ఇలా.. నైట్ డిన్నర్ 7 నుంచి 7.30 మధ్య లైట్ ఫుడ్తో ముగించేస్తే హెల్తీగా ఉంటారని, శరీరంలో గణనీయమైన మార్పులొస్తాయని చెప్పారు. ఎక్కువ భోజనాన్ని జీర్ణం చేసుకోవడానికి రాత్రుళ్లు జీర్ణక్రియ అంత యాక్టివ్ గా ఉండదని.. అందువల్ల.. మండీల్లో మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు.. శీతల పానీయాలు తగ్గించాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పోషకాహార నిపుణులు చెప్పారు.

ALSO READ : ఎంత ఎక్కువగా కాఫీ తాగితే లివర్కు అంత మంచిదని తేల్చిన అధ్యయనం !

రాత్రి సమయంలో శరీరంపై జీవక్రియ భారాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. రాత్రి 7 గంటలకు తినడం కుదరకపోయినా.. ఆలస్యంగా రాత్రుళ్లు 9 తర్వాత 10 గంటల సమయంలో భోజనం చేయాల్సిన పరిస్థితులు ఉంటే.. తక్కువ కార్బోహైడ్రేట్లు, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉండే భోజనాన్ని తినాలని సూచించారు.