తిన్న తర్వాతే కాదు.. రోగాలకూ కూడా చెక్ పెట్టే సోంపులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఇవే!

 తిన్న తర్వాతే కాదు.. రోగాలకూ కూడా చెక్ పెట్టే సోంపులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఇవే!

కడుపునిండా తిన్నాక, వెంటనే గుర్తొచ్చేది సొంపు. కొన్ని సోంపు గింజల్ని నోట్లో వేసుకుని నమలడం దాదాపు అందరికీ అలవాటే. అవి సమలకపోతే భోజనం చేసిన తృప్తి ఉండదు. అవి ఏదో తిన్నది అరగటానికి పనికొస్తాయని అనుకుంటారు. కానీ దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. సోంపుతో టీ చేసుకోవచ్చు. నూనె తీస్తారు. ఇవే కాకుండా సోంపు పొడిని వాడుకోవచ్చు. వీటి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటాయి. వీటివల్ల కలిగే ఆరోగ్య లాభాలు కూడా చాలా.

సోంపు మొక్క ఆసియా, యూరప్ ఖండాల్లో పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో విస్తారంగా సోంపు సాగు చేస్తారు. ఇవి డ్రై, కోల్డ్ ప్లేస్ లోనైతే ఎక్కువ పెరుగుతాయి. వీటిని ప్రాచీన గ్రీకులు ఎక్కువ వాడేవారు. వాళ్లు దీన్ని 'మారథాన్' అంటారు. గ్రీక్లు, రోమన్లు వీటిని వంటల్లో ఔషధాల్లో బాగా వాడేవారు. ఎక్కువగా సలాడ్లు, ఇటాలియన్ సాసేజ్లు, పిజ్జాల మీద చల్లడానికి, సూప్లలో, మాంసాహారాల్లో, పేస్ట్రీల్లో, లిక్కర్ లో ఫ్లేవర్ కోసం సోంపుని వాడుతుంటారు. సోంపుని బెంగాలీలో మౌరీ.. మలయాళంలో పెరుంజీరకం, ఒరియాలో పన మహురి, ఇంగ్లీష్ లో ఫెన్నెల్ అని పిలుస్తారు. సోంపు అనగానే ఒకే రకం అనుకుంటారు. కానీ వీటిలో చాల రకాలున్నాయి. తియ్యగా ఉండే సోంపు పార్సిలీ ఫ్యామిలీకి చెందింది. ఇవి అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతాయి. ఉత్తర యూరప్, అమెరికా, దక్షిణ కెనడా, ఆస్ట్రేలియాల్లో బాగా పెరుగుతాయి. రెండు మీటర్ల ఎత్తు పెరిగే సోంపు చెట్లకు గోల్డెన్ ఎల్లో పూలు పూస్తాయి. వీటి పంటను తెల్లవారుజామున లేదా మధ్యాహ్నం తర్వాత కోస్తారు.  సోంపు కొనాలనుకుంటే ప్యాకెట్ లో ఉన్నవే కొనాలి.

ఇలా నిల్వ చేసుకోవచ్చు
సౌత్ ఆసియన్ రెస్టారెంట్లలో భోజనం తర్వాత సోంపు గింజలు ఇస్తారు. జీర్ణక్రియ సమస్య ఉన్న పిల్లలకు సోంపు నీళ్లు బాగా పనిచేస్తాయి. సోంపులో యాంటీ ఆక్సిడెంట్ లు, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. సోంపుని నిల్వ చేసుకోవచ్చు. అందుకోసం వాటిని వేగించి, ఆరబెట్టి, రెండు ప్లాస్టిక్ షీట్స్ లో చుట్టి కచ్చాపచ్చాగా దంచాలి. తర్వాత గాలి చొరబడని సీసాలో పెడితే కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. సోంపుని పౌడర్ చేసి కూరలు.. గ్రేవీలు.. పచ్చళ్లు వంటి వంటల్లో వాడుకోవచ్చు.

ALSO READ : తమలపాకుతో కిళ్లీను కాదు .. వెరైటీ వంటలు కూడా .. 
 
టి, ఆయిల్..
ఇది అరుగుదలకే కాదు, నోటి దుర్వాసన, చెమటవాసన వంటివి తగ్గడానికి పనికొస్తాయి. సోంపు టీ కళ్లను శుభ్రం చేయడానికి కూడా వాడొచ్చు. గ్యాస్, ఎసిడిటీలని తగ్గిస్తుంది. సోంపు నుంచి ఆయిల్ కూడా తయారు చేస్తారు. అది జాయింట్ పెయిన్స్ కి బాగా పనికొస్తుంది. ఈ నూనె వాడితే గొంతు గరగర, గొంతునొప్పి కూడా తగ్గిపోతాయి.

విషపూరిత మష్రూమ్ ఆకులు తిన్నవాళ్లు సోంపు గింజలను వైన్ లో వేడి చేసి తాగితే విషప్రభావం ఉండదట. లివర్, స్పీన్, గాల్ బ్లాడర్ నొప్పి, వాపు, జాండిస్, గౌట్, క్రాంప్స్ వంటివి కూడా తగ్గుతాయి. సోంపు ఆకులు, గింజలు, వేర్లతో చేసిన నీళ్లు తాగితే లావు తగ్గుతారు తెలుసా!

*సోంపులో ఉన్న పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. సోంపు గింజలను నమలడం వల్ల సెలైవాలో ఉన్ననైట్రైట్ పెరిగి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచుతుందని ఒక స్టడీలో తేలింది.
*ఆడవాళ్లలో నెలసరి టైంలో నొప్పుల్ని, మెనోపాజ్ లక్షణాల్ని తగ్గిస్తుంది. వీటితో చేసే క్యాప్సూల్స్ ని పీరియడ్స్ వచ్చే ముందు వేసుకుంటే ఆ పెయిన్ తగ్గుతుంది. వీక్ నెస్, వాంతి వస్తున్నట్లు అనిపించడం వంటివి తగ్గిపోతాయి.
*సోంపు ఆస్తమా ట్రీట్ మెంట్ కు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నయాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్ ప్రాపర్టీస్ వల్ల గొంతు నొప్పి, ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి.
*ఇందులో లాక్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల ఆడవాళ్లకి పాలు బాగా పడతాయి. బాలింతలకు ఇవి సంప్రదాయ ఔషధంగా ఇస్తారు. పూర్వం నెలసరి క్రమం తప్పకుండా రావడానికి సోంపు టీని తాగేవాళ్లు.
*శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకని వేసవిలో సోంపు నీళ్లు తాగడం బెటర్.
*రోజూ సోంపు తినడం వల్ల కంటి చూపు బాగుంటుంది. వీటిలో ఉన్న ఎ-విటమిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లు మండటం, కంట్లో నుంచి నీరు కారడం... గ్లకోమా వంటి వాటిని తగ్గిస్తుంది.
*వీటిలో విటమిన్ -సి... బీటా కెరోటిన్ ఉంటాయి. అవి బ్లడ్లో గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి.
*సోంపుని రోజూ తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ అనే ఎముకల బలహీనత రాదు.
*చర్మం, పొట్ట, రొమ్ము క్యాన్సర్లని అడ్డుకుంటుందని కొన్ని స్టడీలు చెబుతున్నాయి.
*వీటిని వేడినీళ్లలో మరిగించి, చల్లారాక ముఖానికి దూదితో రాయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది. దాంతోపాటు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. ముఖంపై ముడతలు పోతాయి.