Vijay Birthday Cake: సీఎం విజయ్ బర్త్‌డే కేక్.. ఇప్పుడు కోట్లలో బిజినెస్.. అసలు మ్యాజిక్ ఇదే

Vijay Birthday Cake: సీఎం విజయ్ బర్త్‌డే కేక్.. ఇప్పుడు కోట్లలో బిజినెస్.. అసలు మ్యాజిక్ ఇదే

ఈ సోషల్ మీడియా కాలంలో ఏ వస్తువు ఎప్పుడు వైరల్ అవుతుందో, దేనికి ఒక్కసారిగా క్రేజ్ పెరుగుతుందో చెప్పడం కష్టమే. నిన్నటివరకు సాధారణంగా అమ్ముడైన ఒక కేక్.. ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకప్పుడు హోటళ్లు, బేకరీల విజయాన్ని వాటి రుచి, నాణ్యతే నిర్ణయించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఒక సెలబ్రిటీ పోస్ట్, ఒక వైరల్ ఫొటో లేదా ఒక చిన్న సోషల్ మీడియా మూమెంట్‌ కూడా ఓ బ్రాండ్ భవిష్యత్తునే మార్చేస్తోంది. ఇందుకు చెన్నైలో ఇటీవలే జరిగిన ఓ సంగటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. తమిళనాడు సీఎం, నటుడు విజయ్ పుట్టినరోజు వేడుకల్లో కనిపించిన సాధారణ 'మామిడి-వనిల్లా' కేక్.. ఇప్పుడు చెన్నైలో హాట్ టాపిక్‌గా మారి, ఆ బేకరీకి ఊహించని స్థాయిలో ఆదరణను తీసుకొచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 52వ పుట్టినరోజు (జూన్ 22న) వేడుకల్లో మెరిసిన ‘మామిడి-వనిల్లా’ కేక్ ఇప్పుడు చెన్నైలో సరికొత్త ఫుడ్ ట్రెండ్‌గా మారింది. నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వైరల్ ఫోటో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కేక్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కేవలం రెండు వారాల్లోనే 300 నుంచి 400 ఆర్డర్లు అమ్ముడైనట్లు బేకర్ తన్వి బొకారియా వెల్లడించారు. స్థానిక అభిమానులు దీనికి అధికారికంగా "సీఎం కేక్" (CM Cake) అని పేరు పెట్టారు. విజయ్ క్రేజ్, సోషల్ మీడియా పవర్ కలిసి ఈ కేక్‌ను నగరంలోనే బిగ్గెస్ట్ సంచలనంగా మార్చేశాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

రాత్రికి రాత్రే మారిన బేకరీ జాతకం..

ఈ కేక్‌ను చెన్నైకి చెందిన తన్వి బొకారియా అనే బేకర్ తయారు చేశారు. త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అయిన తర్వాత, ఈ కేక్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గత రెండు వారాల్లోనే దాదాపు 300 నుండి 400 కేక్ ఆర్డర్లు అమ్ముడయ్యాయని బేకర్ తన్వి బొకారియా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మొదట్లో ఇది సాధారణ సీజనల్ మామిడి వెనీలా కేక్ అయినప్పటికీ, ప్రస్తుతం స్థానిక ప్రజలు దీనిని "సీఎం కేక్" (CM Cake)’’ అని పిలుస్తూ ఆర్డర్లు ఇస్తున్నారు. తమ బేకరీ చరిత్రలోనే ఒకే ఫ్లేవర్‌కు ఈ స్థాయిలో ఆర్డర్లు రావడం ఇదే మొదటిసారి'' అని తెలిపారు.

వైరల్ ఫోటో వెనుక కథ..

త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే రూమర్స్ వచ్చిన మరుసటి రోజే ఈ పిక్ బయటపడటంతో నెటిజన్లు ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఫోటోలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని జూమ్ చేసి మరీ రీసెర్చ్ చేశారు. ఆ క్రేజీ డిటెక్టివ్ వర్క్‌లో తేలింది ఏంటంటే.. అక్కడ ఒక్క కేక్ లేదు, మొత్తం మూడు రకాల డెజర్ట్స్ ఉన్నాయి.

ALSO READ :  బేబీ బంప్‌తో రెబా మోనికా స్టన్నింగ్ లుక్.. 

సీఎం కేక్: తన్వి బొకారియా (చెన్నై) చేసిన మాంగో-వనిల్లా క్రేజ్.

టిరమిసు కేక్: హైదరాబాద్‌లోని 'కాంకు పాటిస్సేరీ' నుంచి తెప్పించింది.

స్ట్రాబెర్రీ వైట్ చాక్లెట్ కేక్: చెన్నైలోని 'ది చెఫ్ హౌస్' స్పెషల్.

మొత్తానికి విజయ్-త్రిషల క్రేజ్, సోషల్ మీడియా పవర్ కలిసి ఒక నార్మల్ కేక్‌ను చెన్నైలోనే బిగ్గెస్ట్ ఫుడ్ ట్రెండ్‌గా మార్చేసింది!