బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బట్వారా 1947. ఈ మూవీతో ప్రీతి జింటా వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడదల చేసిన మోషన్ పోస్టర్, క్యారెక్టర్ పోస్టర్లు ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కథేంటంటే?
కొత్త టీజర్‌లో యాక్షన్, ఎమోషన్, దేశభక్తి మూడు అంశాలను అద్భుతంగా మేళవించారు. దేశ విభజన సమయంలో జరిగిన హృదయ విదారక సంఘటనల నేపథ్యంలో సాగే ఈ కథలో, తన కుటుంబాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే ధైర్యవంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తున్నారు. ఆయన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో శబానా ఆజ్మీ, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యాక్షన్.. ఎమోషన్...
1947 భారత విభజన సమయంలో లక్షలాది మంది ఎదుర్కొన్న వలసలు, హింస, కుటుంబాల విచ్ఛిన్నం వంటి చారిత్రక విషాదాన్ని ఈ సినిమా భావోద్వేగాలతో చూపించనుంది. యాక్షన్‌తో పాటు మానవీయ కోణాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి ఆవిష్కరించినట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాజ్‌కుమార్ సంతోషి--సన్నీ డియోల్ కాంబినేషన్ మళ్లీ రావడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు బాలీవుడ్‌లో క్లాసిక్స్‌గా నిలిచాయి.
ALSO READ : 'ది ఒడిస్సీ'తో నోలన్ సునామీ..
భారీ అంచనాలతో ..
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జావేద్ అక్తర్ సాహిత్యం రాశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయాన్ని భారీ స్థాయిలో తెరపై చూపించనున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి...
