డేంజర్లో మగ జాతి: ఆరు నెలల్లోనే భార్యల వల్ల 554 భర్తలు చచ్చిపోయారు..!

డేంజర్లో మగ జాతి: ఆరు నెలల్లోనే భార్యల వల్ల 554 భర్తలు చచ్చిపోయారు..!

మన దేశంలో మగాళ్ల బతుకులు మరీ ముఖ్యంగా పెళ్లైన మగాళ్ల జీవితాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. 2026లో ఈ ఆరు నెలల్లోనే.. అంటే జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకూ మన దేశంలో 554 మంది భర్తలు మరణించారు. గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' అనే NGO ఈ రిపోర్ట్ బయటపెట్టింది.

మీడియాలో వచ్చిన వార్తలు, జూలై 14 వరకు ఫౌండేషన్ నమోదు చేసిన సమాచారం ఆధారంగా.. 2026 మొదటి ఆరు నెలల్లో మన దేశంలో భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన 554 కేసులను పోలీసులు నమోదు చేసినట్లు ఒక డాక్యుమెంటేషన్ నివేదికను సదరు NGO విడుదల చేసింది.

ఇలా చనిపోయిన భర్తల్లో.. ఎక్కువ మంది భార్య, ఆమె ప్రియుడి చేతుల్లో హత్యకు గురైన వారే కావడం శోచనీయం. మొత్తం 554 కేసుల్లో 322 మంది భర్తలు ఇలా భార్యల చేతుల్లో హత్యలకు గురయ్యారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గృహ హింస, వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు.. ఇతర సమస్యలతో 232 మంది భర్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ఈ 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' తెలిపింది. ఇంకా ఎక్కువ మంది భర్తలే చనిపోయి ఉండొచ్చని కూడా పేర్కొంది.

భర్తల హత్యల వెనుక భార్యల వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని నివేదిక గుర్తించింది. నమోదు చేయబడిన 322 కేసులలో 194 కేసులు, అంటే సుమారు 60.2 శాతం కేసుల్లో.. వివాహేతర సంబంధం కారణంగానే భర్తల హత్యలు జరిగాయి. భర్తలు భార్య వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినప్పుడు, అడ్డంకిగా మారినప్పుడు, భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ : రైలు ప్రమాద బాధితులకు సుప్రీంకోర్టు ఊరట

నమోదైన హత్య కేసులలో విషప్రయోగం, సజీవ దహనం, విద్యుదాఘాతం, గొంతు నులమడం, శరీర భాగాలను వేరు చేయడం, మృతదేహాలను పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలుగా లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటి పద్ధతులు ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది.