మల్లీశ్వరి సినిమాలో ఎమ్మెస్ నారాయణ, హేమ ఎపిసోడ్ గుర్తుందా. భర్త ఒక సిటీలో జాబ్ చేస్తుంటే.. భార్య మరో చోట జాబ్ చేస్తుంటుంది. వీకెండ్స్ లోనే కలవడం. ఇద్దరూ ఒకే సిటీలో ఉండేందుకు పడే తాపత్రయం చూస్తే కాస్త కామెడీగా.. జాలీగా అనిపిస్తుంది కదా. అక్కడితో ఆగండి. ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా కలిసుండాలని వాళ్లు తపన పడుతుంటారు.
వారంలో ఐదు రోజులు దూరంగా ఉంటూ.. వారాంతంలో రెండు మూడు రోజులు కలిసి ఉండటం.. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్. అయితే సినిమాలో లాగా ఇద్దరూ ఒకే చోట వర్క్ చేయాలనే తపన మాత్రం ఇక్కడ ఉండదు. ప్రశాంతంగా ఎవరి పనిలో వాళ్లు.. ఎవరికి వర్క్ అలాట్ అయిన సిటీలో వ వాళ్లు ప్రశాంతంగా జాబ్స్ చేసుకుంటూ.. వీకెండ్ లో అన్యోన్యంగా, ఆప్యాయంగా కాపురం చేసుకోవడం.
21వ సెంచరీలో రిలేషన్స్షిప్ లో ఇదో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. మెట్రో సిటీల్లో చాలా మంది కపుల్ ఇలాగే ఆలోచిస్తున్నారు. కొందరైతే లవ్ లో ఉన్నపుడే దీనిపై క్లారిటీగా ఉంటున్నారు. వీకెండ్ కాపురం.. చాలు అన్నట్లుగా డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు.
ఈ ట్రెండ్ లో కలిసి ఉండాలనే సంప్రదాయ నిబంధనలను దూరం పెడుతున్నారు కపుల్. ఎంత దూరం అయినా.. వేర్వేరు సిటీల్లో ఉండటం.. వీకెండ్ లో కలవటం. దీని వలన వారం పాటు దూరంగా ఉంటూ ఒకరిని ఒకరు మిస్ అయిన ఫీలింగ్ తో.. ఇద్దరి మధ్య ఎఫెక్షన్ బాగా పెరిగిపోతుందని కపుల్స్ అంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలకు తావు ఉండదని చెబుతున్నారు.
ఈ వీకెండ్ మ్యారేజెస్ వలన చాలా జంటలకు, ఇరువురిపై గౌరవం, ఉమ్మడి లక్ష్యాలు ఉన్నప్పటికీ, డైలీ రొటీన్స్ మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. మేము ప్రతి వారాంతంలో కలుసుకుంటాము, ఆ రెండు రోజులు మాకు చాలా పవిత్రమైనవి.. అని బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అన్నారు. అతని భార్య పూణేలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటోంది. మేము ఒకరినొకరు లైట్ తీసుకోము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మా మధ్య గొడవలు కూడా చాలా వరకు తగ్గాయి అని చెబుతున్నారు.
ALSO READ : డేంజర్లో మగ జాతి: ఆరు నెలల్లోనే భార్యల వల్ల 554 భర్తలు చచ్చిపోయారు..!
వీకెండ్ మ్యారేజ్ సారాంశం ఇదే. ఫిజికల్ గా దూరంగా ఉన్నా.. ఇద్దరి మధ్య అన్యోన్యతకు తిరుగుండదు. వారం మొత్తం ఇండిపెండెంట్ గా జీవిస్తూనే.. తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా కలుసుకుంటారు.
ఈ మార్పుకు కారణాలు పర్సనల్ అయినవి కొన్ని అయితే కల్చర్ పరంగా వస్తున్నవి కూడా కొన్ని ఉంటాయి. మెట్రో సిటీల్లో వర్క్ టైమ్ ఎక్కువగా ఉండే జాబ్స్ కారణంగా.. ఒత్తిడి వల్ల.. ఇప్పటి వరకు వస్తున్న సాంప్రదాయ జీవన విధానానికి సమయం దొరకడం కష్టంగా ఉండటంతో, దంపతులు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. ఇలాంటి ఆప్షన్స్ ఎంచుకుంటున్నారు.
దీనికి కారణంగా కెరీర్ రెస్పాన్సిబులిటీ అని చెబుతున్నారు. ఇద్దరూ కెరీర్ లో ఎదగాలని ప్రయత్నిస్తుండటంతో – ఎవరూ తమ యాంబిషన్స్ ను త్యాగం చేయడానికి ఇష్ట పడటం లేదు. మరికొందరికి, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ కీలక పాత్ర పోషిస్తాయి. నెలకు రెండుసార్లు తన భర్తను కలిసే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇలా అంటున్నారు. విడిగా జీవించడం మానసికంగా బ్యాలన్స్డ్గాఉండటానికి నాకు సహాయపడింది. నేను నాతో గడిపేందుకు, నా స్నేహితులతో టైమ్ స్పెండ్ చేసుందుకు సమయం దొరుకుతోంది. మా వైవాహిక జీవితాన్ని కూడా ఆరోగ్యకరంగా కొనసాగించగలుగుతున్నాను అని చెప్పింది.
కొన్ని రిలేషన్స్ డిజిటల్ పరిచయాలుగా మొదలై, ప్రణాళిక ప్రకారం కాకుండా అవసరం కొద్దీ వారాంతపు వివాహాలుగా పరిణామం చెందుతున్నాయి. వేరే సందర్భాల్లో, భాగస్వాములలో ఒకరు విదేశాలలో చదువుకోవడం లేదా స్పెషల్ ట్రైనింగ్ పొందడం వంటి అకాడెమిక్ ప్రయత్నాలు, టెంపరరీగా దూరం ఉండటానికి దారితీసి, అవి క్రమంగా ఒక లైఫ్ స్టైల్ గా మారిపోతున్నాయి. అలాంటి వాతావరణానికి మెల్లిగా కపుల్ అలవాటు పడుతున్నారు.
సహజంగానే, టెక్నాలజీ ఈ మార్పును ఈజీ చేస్తోంది. ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా చేసేందుకు వీడియో కాల్స్, నిరంతర మెసేజింగ్, షేర్డ్ డిజిటల్ క్యాలెండర్‌ల ద్వారా, భౌతిక దూరం ఉన్నప్పటికీ జంటలు ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫీలంగ్ తీసుకురావటంతో ఈ ట్రెండ్ సక్సెస్ అవుతోంది.
వీకెండ్ మ్యారేజెస్ సక్సెస్ కావాలంటే కమ్యూనికేషన్, నమ్మకం, హద్దులు, అంచనాలపై పరస్పర అవగాహన చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పాట్నర్స్ ఎమోషనల్ గా మెచూర్ గా ఆలోచించినప్పుడు, ఈక్వల్ గా ఇన్ వాల్వ్ అయినప్పుడు ఈ రిలేషన్ షిప్ బెస్ట్. ఇది ప్రాబ్లమ్స్ తో కూడిన రిలేషన్స్షిప్ కు ఇది కరెక్ట్ కాదు. తమ అవసరాలను అర్థం చేసుకున్న జంటలు ఉద్దేశపూర్వకంగా ఇష్టపడి తీసుకునే నిర్ణయం అని ముంబైకి చెందిన ఒక రిలేషన్షిప్ అడ్వైజర్ చెబుతున్నారు.
