అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య

మంచిర్యా/గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అట్రాసిటీ కేసులను త్వరగా విచారించి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు వెంటనే పరిహారం అందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య సూచించారు. శుక్రవారం కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ స్కూళ్లు, ఆర్ఓఎఫ్ఆర్ చట్టం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై మంచిర్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలో 56,969 మంది ఎస్టీలు,1,99,493 మంది ఎస్సీలు ఉన్నారని, వారికి రాజ్యాంగ హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

కార్యక్రమంలో డీఎఫ్​వో రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్​కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఆర్వో మోతిరామ్, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, ఆర్డీవో జి.శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ పాల్గొన్నారు. 

సీఎం దృష్టికి గిరిజనుల సమస్యలను తీసుకెళ్తాం

గుడిహత్నూర్,వెలుగు: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వారి సమస్యలను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దృష్టికి  తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యులు, ఉట్నూరు ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ఉట్నూరు మండలం కుమ్మరికుంట,ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పర్యటించారు. 

కుమ్మరికుంటలో కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ్యులు స్థానికులతో మాట్లాడుతూ వారి జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేస్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగోబా దేవాలయాన్ని దర్శించుకున్నారు. మెస్రం వంశీయులతో ఆత్మీయ సమావేశమై నాగోబా జాతర విశిష్టత, గిరిజన సంప్రదాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.