ఈ వారాంతంలో బంగారం వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ చర్యలతో పరిస్థితులు మళ్లీ దిగజారటం ఇన్వెస్టర్లను బులియన్ మార్కెట్లకు దూరం చేస్తోంది. ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుతాయనే క్లారిటీ లేకపోవటం పలుమార్లు శాంతి చర్చల్లో అవాంతరాలు చూస్తుంటే గోల్డ్ మెరుపులకు చాలా టైం పట్టేలా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో తగ్గిన రేట్లలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
జూలై 17న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.76 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 253గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 065గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 17, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 35వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.
