భూదాన్ పోచంపల్లి, వెలుగు : ఫార్మా కంపెనీ రియాక్టర్ లో పడి ఓ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి (42) ధోతిగూడెం గ్రామ శివారులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం కంపెనీలో రియాక్టర్ ప్రారంభించాల్సి ఉండగా.. పనులను పరిశీలించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు రియాక్టర్ లో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కంపెనీ యాజమాన్యం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
