Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జులై 19న లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లోనే అత్యంత ఉత్కంఠభరితమైనదిగా మారబోతోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కంటే ముందే రోహిత్ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ లండన్ చేరుకోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తన వన్డే భవిష్యత్తుపై సెలెక్టర్ల వ్యూహాలను ముందుగానే తెలుసుకున్న హిట్‌మ్యాన్, భారత జెర్సీలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా తన తల్లిదండ్రుల కోసం లండన్ పర్యటన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
2027 వరల్డ్ కప్ రేసు నుంచి రోహిత్ ఔట్:
39 ఏళ్ల రోహిత్ శర్మను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగం చేయడం లేదని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా రోహిత్ ఆశించిన స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో 11 రన్స్, రెండో మ్యాచ్‌లో 26 పరుగులకే పరిమితమయ్యాడు. భవిష్యత్తు భారత జట్టుని నిర్మించే క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లకు ఓపెనర్లుగా పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.
►ALSO READ | సూపర్ కంప్యూటర్ జ్యోతిష్యం : ఫుట్ బాల్ వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే..
ముగియనున్న హిట్‌మ్యాన్ శకం:
ఇప్పటికే టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన రోహిత్ శర్మకు ప్రస్తుతం భారత్ తరపున ఆడుతున్న ఏకైక ఫార్మాట్ వన్డే మాత్రమే.. ఈ నివేదికలు గనుక నిజమైతే, రోహిత్ శర్మ తన తల్లిదండ్రుల సమక్షంలో భారత జెర్సీలో తన చివరి ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ రన్నరప్‌గా, 2024 టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా భారత క్రికెట్ రూపురేఖలు మార్చేసిన రోహిత్ శర్మ.. లార్డ్స్ మైదానంలో తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికితే, అది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యంత భావోద్వేగ క్షణంగా (Emotional Moment) మిగిలిపోనుంది.
🚨 NO ROHIT SHARMA FOR WORLD CUP. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2026
- Lord’s could be Rohit’s final ODI as the selectors have conveyed him he’s not part of the 2027 World Cup plans. (Express Sports). pic.twitter.com/7Mg7Cki2TV
