Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ మరోసారి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో.. అతని వన్డే కెరీర్ ముగిసిపోనుందంటూ వస్తున్న వార్తలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అతని స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తూ అల్టిమేటం జారీ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక రోహిత్ రిటైర్మెంట్ రూమర్లని భారత్ బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ పూర్తిగా తోసిపుచ్చాడు.
రెండు మ్యాచ్‌ల ఫామ్ ఆధారంగా అంచనా వేయలేం:
రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడు తన భవిష్యత్తు గురించి ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడని, అంతటి మానసిక స్థాయి ఉన్న ప్లేయర్ రోహిత్ అని సితాంశు కోటక్ పేర్కొన్నారు. మొదటి రెండు వన్డేల్లో హిట్ మ్యాన్ ఆశించిన రీతిలో రన్స్ చేయలేదన్న మాట నిజమే అయినప్పటికీ, అంత మాత్రానికే అతని సామర్థ్యాన్ని తక్కువంచనా వేయలేమని అతడు అభిప్రాయపడ్డారు. కార్డిఫ్ వన్డేలో రోహిత్ క్రీజులో ఉన్నంతసేపు మంచి ఇన్నింగ్స్ ఆడేలానే కనిపించాడు, కానీ దురదృష్టవశాత్తూ ఔట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో ఇలాంటి హెచ్చుతగ్గులు కామన్, లార్డ్స్‌లో జరగబోయే మూడో వన్డేలో రోహిత్ నుంచి మనం పూర్తిగా భిన్నమైన, అద్భుతమైన ఇన్నింగ్స్‌ను చూసే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ : లండన్కు రోహిత్ శర్మ ఫ్యామిలీ
రోహిత్ స్ట్రగుల్ అవ్వట్లేదు:
రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడంటూ వస్తున్న విమర్శలను ఇండియా బ్యాటింగ్ కోటక్ తీవ్రంగా ఖండించారు. కార్డిఫ్ పిచ్‌పై కాస్త డబుల్ బౌన్స్ (Variable Bounce) ఉండటంతో హిట్ మ్యాన్ సాధారణంగా ఆడే ఆన్-ది-అప్ షాట్లను ఆడటంలో కాస్త అసౌకర్యానికి గురయ్యాడని విశ్లేషించారు. అదే సమయంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలకు లూజ్ బాల్స్ లభించడంతో వారు వేగంగా రన్స్ సాధించగలిగారని, కానీ రోహిత్‌కు అతని స్లాట్‌లో బంతులు పడకపోవడంతో ఇన్నింగ్స్ స్లో అయిందని స్పష్టం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది అగ్రశ్రేణి బ్యాటర్ల కెరీర్‌లో ఇలాంటి మ్యాచ్‌లు వస్తుంటాయని, కాబట్టి రోహిత్ కోసం స్ట్రగులింగ్ (Struggling) అనే పదాన్ని ఉపయోగించడం కరెక్ట్ కాదని కోచ్ సితాంశు కోటక్ భరోసా ఇచ్చారు.
Meet Team India's batting Coach Sir Sitanshu Kotak who didn't play any single international match for Team India and still somehow he's is Batting Coach & teaching players like Virat Kohli that How to play under pressure!! pic.twitter.com/skJ7GcCok2
— NiiK (@ElevateUrMind4) July 17, 2026
