FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) ఫైనల్ విజేతగా ఎవరు నిలవబోతున్నారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ ఫుట్‌బాల్ గణాంకాల సంస్థ ఆప్టా (Opta)కు చెందిన సూపర్ కంప్యూటర్ తన తాజా అంచనాలను వెలువరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ప్రస్తుత యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ మధ్య జరగనున్న ఈ మహా ఫైనల్ పోరులో స్పెయిన్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చి చెప్పింది.
సూపర్ కంప్యూటర్ లెక్కలు ఇవే:
ఈ విశ్లేషణ కోసం సూపర్ కంప్యూటర్ కేవలం పైపైన అంచనాలకే పరిమితం కాలేదు, టోర్నమెంట్‌కు సంబంధించిన వేలకొద్దీ సమీకరణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జట్ల ప్రస్తుత ఫామ్, ఆటగాళ్ల సామర్థ్యాలు, డిఫెన్స్ అండ్ అటాకింగ్ వంటి అన్నింటినీ బేస్ చేసుకుని దాదాపు 25,000 సార్లు మ్యాచ్ సిమ్యులేషన్స్ రన్ చేసింది. ఈ డిజిటల్ రిపోర్ట్స్ ప్రకారం స్పెయిన్ జట్టు టైటిల్ గెలవడానికి 56.05 శాతం అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మెస్సీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా:
లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాలు కేవలం 43.69 శాతంగా ఉన్నట్లు సూపర్ కంప్యూటర్ తేల్చి చెప్పింది. 2022 ఖతార్ వరల్డ్ కప్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన అర్జెంటీనా, ఈ టోర్నమెంట్‌లో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను దాటుకుని ఫైనల్‌కు చేరుకుంది. ముఖ్యంగా నాకౌట్ దశలో ఈ జట్టు చూపిన అద్భుతమైన కమ్‌బ్యాక్ మెంటాలిటీని, ఒత్తిడిని అధిగమించే శైలిని ఫుట్‌బాల్ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు.
సూపర్ కంప్యూటర్ల లెక్కలను మెస్సీ బ్రేక్ చేసేనా:
గణాంకాల పరంగా స్పెయిన్ ముందంజలో ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్ మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికి సాధ్యం కాదు.. సూపర్ కంప్యూటర్ల లెక్కలను తలకిందులు చేస్తూ కింగ్ మెస్సీ తన కెరీర్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనాను మరోసారి ప్రపంచ విజేతగా నిలబెడతాడా, లేకపోతే స్పెయిన్ తన అజేయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ మెగా ఫైనల్ ఫైట్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జులై 19న (భారత కాలమానం ప్రకారం జులై 20 తెల్లవారుజామున 12:30 గంటలకు) జరగనుంది.
🏆 THE FINAL IS SET! 🇦🇷🇪🇸
— SUPERFORTUNE AI (@SUPERFORTUNE888) July 16, 2026
Predictions for the Argentina vs Spain final are now live.
Check them out now! 👀
🔗 https://t.co/XWOAPaPZgu pic.twitter.com/O9wfVC10w4
