Rohit Sharma Retirement: భారత క్రికెట్ అభిమానులకు ఇది అస్సలు జీర్ణించుకోలేని న్యూస్.. జూలై 19న (ఆదివారం) లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఖరి మ్యాచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్స్‌లో భాగంగా రోహిత్ తో మూవ్ ఆన్ (Move on) అవ్వాలని బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత వారం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు కలిసి రోహిత్‌తో ఈ విషయంమై సుదీర్ఘంగా చర్చించినట్లు బోర్డు వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది.
2027 వరల్డ్ కప్ వ్యూహాలు:
సౌతాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని, జట్టులో నెక్స్ట్ జనరేషన్ (Next-Gen) ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మేనేజ్‌మెంట్ గట్టిగా ఫిక్స్ అయింది. ఇప్పటికే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యశస్వి జైస్వాల్ లాంటి యువ సంచలనానికి ఓపెనర్‌గా పూర్తిస్థాయి అవకాశాలు ఇవ్వాలనేది గంభీర్ టాక్టికల్ ప్లాన్. భవిష్యత్తు ప్రణాళికల్లో రోహిత్ కు చోటు లేదని సెలెక్టర్లు స్పష్టం చేయడంతో, గౌరవప్రదంగా తప్పుకునేందుకు తన రిటైర్మెంట్ ప్రకటనపై తుది నిర్ణయాన్ని బోర్డు రోహిత్ ముందే పెట్టేసింది. అయితే సెలెక్టర్ల ఈ హఠాత్తు నిర్ణయంపై హిట్ మ్యాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తగ్గిన ఫామ్.. తప్పని కఠిన నిర్ణయం:
ఇప్పటికే 2024 జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే ఆ ఫార్మాట్‌కు, ఆపై 2025 మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని మ్యాచ్‌లుగా రోహిత్ తన మార్క్ ఇంపాక్ట్ (Impact) చూపించలేకపోతున్నాడు. గురువారం కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 రన్స్ చేసి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన సెలెక్టర్లు.. ఇప్పుడు బ్యాటర్‌గా కూడా రోహిత్ చాప్టర్‌ను క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇండియన్ క్రికెట్‌ను మార్చేసిన అగ్రెసివ్ టెంప్లేట్:
రోహిత్ శర్మ కెరీర్ ముగుస్తుండవచ్చు కానీ, ఒక లీడర్‌గా అతను భారత క్రికెట్‌కు నేర్పిన అగ్రెసివ్ మైండ్ సెట్ ఎప్పటికీ నిలిచిపోతుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో టాప్ ఆర్డర్‌లో అతను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు, ఆ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో అతను చూపిన ఫియర్-లెస్ అటాకింగ్ టెంప్లేట్ ఇండియా బ్లూప్రింట్‌నే మార్చేసింది. ఏదేమైనా, క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో జులై 19న రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు.
