ఎమోషనల్ డ్రామాగా సహా మూవీ

ఎమోషనల్ డ్రామాగా సహా మూవీ

శివ కుమార్ కాసారం హీరోగా నిశాంత్ దోటి దర్శకత్వంలో తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్న చిత్రం ‘సహా:  లైఫ్ ఆఫ్ సంజు’. ఎమోషన్ ఆఫ్ సహా పేరుతో గురువారం ఈ మూవీ నుంచి  ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ మెలోడీకి పూర్ణాచారి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌కు అతిథిగా హాజరైన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ  ‘ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. 

ఇందులోని ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌‌లో కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు. శేఖర్ చంద్ర సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని హీరో శివ కుమార్ అన్నాడు. ఇందులోని హీరో, హీరోయిన్ పాత్రలను ప్రేక్షకులు చాలాకాలం గుర్తుంచుకుంటారని దర్శకుడు నిశాంత్ చెప్పాడు. ఇదొక మంచి ప్రాజెక్ట్ అని, తప్పకుండా విజయం సాధిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న మధుర శ్రీధర్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.