ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ ఇరిగేషన్ ఆఫీసర్లు

ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్..  ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ ఇరిగేషన్ ఆఫీసర్లు
  •     రూ. 60 వేలు తీసుకుంటుండగా పట్టివేత

ఆదిలాబాద్, వెలుగు : ఎన్ వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్న ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ రమేశ్ ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం... సోనాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ శివారులో కోళ్ల ఫాం ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించాడు. 

కోళ్ల ఫాం నిర్మించే ప్లేస్ పక్క నుంచి ఓ కాల్వ వెళ్తుండడంతో ఎన్ వోసీ కోసం ఇరిగేషన్ ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ రమేశ్ ను కలువగా రూ. లక్ష డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ. 60 వేలకు ఒప్పుకున్నారు. తర్వాత సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ వెళ్లి రూ. 60 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఈఈ, ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.