ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 18 నుంచి జులై 31 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 50.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 25 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 18.
లాస్ట్ డేట్: జులై 31.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.icai.orgను సందర్శించండి.
