జర్మనీలో విషాదం.. ఇండియన్స్ ఉంటున్న ఫ్లాట్కు నిప్పు పెట్టిన దుండగుడు.. ముగ్గురు మృతి

జర్మనీలో విషాదం.. ఇండియన్స్ ఉంటున్న ఫ్లాట్కు నిప్పు పెట్టిన దుండగుడు.. ముగ్గురు మృతి

జర్మనీలో విషాదం జరిగింది. జర్మనీలోని బోచుమ్‌లో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ముగ్గురు భారతీయులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు రొమేనియాకు చెందిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా భావిస్తూ అరెస్టు చేశారు. జర్మనీలోని బోచుమ్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో 25, 27 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల యువకుడు ఉన్నారు.

హత్య అనుమానంతో పోలీసులు ఆ భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని అరెస్టు చేశారు. మెట్ల మీదుగా మంటలు పైకి వ్యాపించడంతో, పై అంతస్తులలోని నివాసితులను చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది మెట్లను ఉపయోగించలేకపోయారు. అందువల్ల ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది టర్న్‌టేబుల్ నిచ్చెనతో ఇద్దరిని, పోర్టబుల్ నిచ్చెనలతో ఇద్దరిని, సేఫ్టీ కుషన్‌తో ఒకరిని రక్షించారు.