మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై ఓ రెనాల్ట్ పెట్రోల్ కారు మంటల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కారులో ఉన్నవాళ్లు వరంగల్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది. అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు నంబర్ TS 09 EU 2577.
విజయవాడ బైపాస్‌లో కూడా ఇటీవల ఇలాంటి ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. రెయిలింగ్‌ను ఢీకొని ఈవీ కారు పూర్తిగా తగలబడింది. కారులో ఉన్న నలుగురు సజీవ దహనం కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కారులో నుంచి బయట పడే లోపే మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. దిగే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాందేవ్ (39), అతని తల్లి అరుణ, విజయ అనే మహిళతో పాటు మరో చిన్నారి కూడా చనిపోయారు.
