కోల్కతా: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై ఓ మహిళా కత్తితో దాడికి యత్నించిందన్న ఆరోపణలను కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు. మమతా బెనర్జీపై ఎలాంటి దాడి జరగలేదని.. ఆమెపై దాడి జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నంద్ బుధవారం (అక్టోబర్ 14) మీడియాతో మాట్లాడారు.
దుర్గా పూజను ప్రారంభించడానికి వెళ్తున్న మమతా బెనర్జీపై ఆమె నివాసం వెలుపల ఒక మహిళ దాడి చేసిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆ ఫిర్యాదులో ఎలాంటి ఆధారం గానీ, నిజం గానీ లేదని తెలిపారు. దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా దీదీని కలవడానికి వెళ్లారని పేర్కొన్నారు. టీఎంసీ కార్యకర్తలు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. సదరు మహిళ, ఆమె తండ్రి మమతా బెనర్జీకి ముందే పరిచయమని చెప్పారు.
మమతాపై దాడికి యత్నం..!
టీసీఎం అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని ఓ మహిళా కత్తితో మమతా బెనర్జీపై దాడికి యత్నించినట్లు టీఎంసీ ఆరోపించింది. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ కార్యకర్తలు సదరు మహిళను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో దీదీకి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మమతా బెనర్జీ భద్రతపై టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది.
టీఎంసీ వర్గాల ప్రకారం. మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి దుర్గా పూజా పండాలు ప్రారంభించేందుకు కోల్కతాలోని కాళీఘాట్లో తన నివాసం నుంచి దీదీకి బయటకు వచ్చారు. ఈ క్రమంలో జనసమూహం నుంచి ఓ మహిళా మమతా బెనర్జీ వైపు దూసుకొచ్చి కత్తితో దాడికి యత్నించారు.
►ALSO READ | ఢిల్లీలో CJP సరికొత్త నిరసన: కాక్రోచ్లకు అభిజిత్ దీప్కే కీలక పిలుపు
దీదీ చీరను లాగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. టీఎంసీ పార్టీ కార్యకర్తలు వెంటనే ఆ మహిళను పట్టుకుని అనంతరం కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడికి యత్నించిన మహిళ మత్తుపదార్థాల ప్రభావంలో ఉందని, ఆమె చేతిలో కత్తి ఉందని రాజ్యసభ ఎంపీ డోలా సేన్ చెప్పినట్లు సమాచారం.
ఆమె మమతా బెనర్జీ మేనకోడలినని చెప్పుకుంటూ జనసమూహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో మాజీ సీఎం మమతా బెనర్జీ భద్రతా ఏర్పాట్లపై బీజేపీ ప్రభుత్వాన్ని టీఎంసీ ప్రశ్నించింది. మమతా బెనర్జీకి ప్రాణహాని ఉందని.. ఆమెకు ఏమైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీపై దాడికి యత్నం జరగడం బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
