నిజామాబాద్ జిల్లా బోధన్ లో చీతా ఫోర్స్ నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లతో అక్రమంగా నూనె తయారు చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బుధవారం ( అక్టోబర్ 14 ) బోధన్ లోని గాంధీ నగర్ లో నిర్వహించిన ఈ దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
బోధన్ లోని గాంధీ నగర్ లో పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లతో అక్రమంగా నూనె తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసింది చీతా ఫోర్స్ టీం. నిందితుల దగ్గరి నుంచి 900 లీటర్ల నూనె స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులు మహ్మద్ షఫీయుద్దీన్, మహ్మద్ సోఫిద్దీన్, అబ్దుల్ అన్వర్ లను అదుపులోకి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఆహార పదార్థాల కల్తీపై తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
