సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. NEET-UG 2026 పేపర్ లీక్, CBSE ఆన్‌స్క్రీన్ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా జూన్ 28న దీక్ష ప్రారంభించిన వాంగ్‌చుక్ ఇప్పటికీ తన నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.
CJP ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసన ఇప్పటికే 25వ రోజుకు చేరుకుంది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆయన మాత్రం తన డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, రచయితలు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ.. అదే సమయంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు తెలిపిన రాజకీయ నాయకులు
1. అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ అధినేత)
2. మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి)
3. శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)
4. ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-యూబీటీ చీఫ్)
5. అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్)
6. అతిషి (ఆప్ ఎమ్మెల్యే)
7. మహువా మొయిత్రా (టీఎంసీ ఎంపీ)
8. జాన్ బ్రిట్టాస్ (సీపీఎం రాజ్యసభ సభ్యుడు)
9. సాగరికా ఘోష్ (టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు)
10. ప్రియా సరోజ్ (ఎస్పీ ఎంపీ)
11. రోహిత్ పవార్ (ఎన్‌సీపీ-ఎస్పీ ఎమ్మెల్యే)
12. సాకేత్ గోఖలే (టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి)
13. అనీష్ గవాండే (ఎన్‌సీపీ-ఎస్పీ అధికార ప్రతినిధి)
సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు తెలిపిన సినీ ప్రముఖులు
* షబానా ఆజ్మీ
* జీనత్ అమన్
* ప్రకాష్ రాజ్
* చిన్మయి శ్రీపాద
* వీర్ దాస్
* ఓమి వైద్య
* అరుంధతి రాయ్
* నసీరుద్దీన్ షా
* రత్నా పాఠక్ షా
* సోనీ రజ్దాన్
* స్వర భాస్కర్
వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒకవైపు ఆయన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతుండగా, మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే వైద్య సహాయం అందించి దీక్షను విరమించాలని పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
