సూర్యాపేట, వెలుగు : ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు మూసీ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించారు. గురువారం నుంచే కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మూడు దశల్లో నీటిని విడుదల చేస్తామని, ప్రాజెక్టులో నీటి నిల్వలను బట్టి అవసరమైతే నాలుగో తడిని కూడా అందిస్తామని తెలిపారు.
మొదటి దశలో జూలై 16 నుంచి ఆగస్ట్ 5 వరకు 20 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రెండో దశలో ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు, మూడో దశలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు నీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ లోకి వచ్చే వరద నీటి లభ్యతను బట్టి నాలుగో తడి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
