జ్యోతిష్యం :60 డిగ్రీల దూరంలో కుజుడు.. శని... నాలుగు రాశుల వారికి సానుకూల మార్పులు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..!

జ్యోతిష్యం :60 డిగ్రీల దూరంలో కుజుడు.. శని...  నాలుగు రాశుల వారికి సానుకూల మార్పులు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి.  ఇలా మారే సమయంలో కొన్ని గ్రహాలు కలుస్తాయి.  జులై 19 ఆదివారం రాత్రి 11:37 గంటలకు రెండు అత్యంత శక్తివంతమైన  కుజ, శని గ్రహాల మధ్య 60 డిగ్రీల శుభ దృష్టి ఏర్పడుతుంది.  .ఇది చాలా  శక్తివంతమైన యోగం. 12 రాశుల వారిపై ప్రభావం ఉన్నా .. నాలుగు రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..! 

మేష రాశి :  కుజుడు.. శని .. ఒకేరాశిలో కలవడం ఈ రాశి వారికా అన్ని విధాలుగా మంచి జరుగుతుంంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి.  కష్టానికి తగిన గుర్తింపు వప్తుంది.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.  వ్యాపారస్తులు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కన్టమర్లు రావడంతో గిరాకీ బాగా ఉంటుంది.  పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

వృషభరాశి:  కుజుడు... శని గ్రహాలు మధ్య   ఏర్పడిన యోగం వలన  ఈ రాశి వారికి  కొన్ని కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆందోళన పెరగడం.. ఒత్తిడి.. మొదలైనవి ఉంటాయి.  వాహనం డ్రైవింగ్​ విషయంలో అప్రమత్తంగా ఉండండి.  కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు.  ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మిధునరాశి:  శని.. కుజుడు గ్రహాల మధ్య 60 డిగ్రీల దూరంలో శుభయోగం ఏర్పడటం  వలన ఈ రాశి వారికి కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది.  అనవసరంగా వాదనలు జరిగే అవకాశం ఉంది.  ఆదాయం ఉన్నా.. డబ్బు చేతిలో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  మీరు ఎంతగానో ప్రేమిస్తున్న వారు దూరమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి ఉపశమనం పొందుతారు.

కర్కాటక రాశి:  శని.. కుజుడు.. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచారం  వలన ఈ రాశి వారికి ప్రతి విషయంలోను శుభఫలితాలు ఉంటాయి.  అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.  కొత్త ప్రాజెక్ట్​లు చేపడుతారు.  పెండింగ్​ లో ఉన్న పనులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కలగడంతో సంతోషంగా ఉంటారు.

►ALSO READ | కేవలం బరువు తగ్గితే సరిపోదు.. షుగర్ రాకుండా ఉండాలంటే మీ ఒంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసా?

సింహరాశి:  కుజుడు.. శని .. 60  డిగ్రీల కోణంలో ఉండటం  వలన ఈ రాశి వారికి శత్రువులు పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవహారాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారులు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారివలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు.

కన్యారాశి:  శని,  కుజుడిని 60 డిగ్రీల దూరంలో సంచారం  వలన ఈ రాశి  వారికి కొన్ని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.  వాహనం డ్రైవింగ్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీరు నమ్మిన వారు  మీ గురించి దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.  ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు ఆశించిన లాభాలు ఉండవకపోవచ్చని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి.

తులారాశి:  శని .. కుజుడు 60 డిగ్రీల దూరంలోకి  రావడంతో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకావశం ఉంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోను చర్చించవద్దు.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశం ఉంది.  ప్రేమ.. పెళ్ళి వ్యవహారాలు వాయిదా వేయండి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి :   కుజుడు.. శని మధ్య శుభయోగం ఏర్పడటంతో ఈ రాశి వారికి మానశిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. నిరుద్యోగలు గుడ్​ న్యూస్​ వింటారు.వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది. 

ధనస్సురాశి: ఈ రాశి వారు ఆర్ధిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది.  అనవసర పరిచయాలు చోటు చేసుకుంటాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగస్తులు .. వ్యాపారస్తులు ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు.  ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. దక్షిణామూర్తి స్త్రోత్రం పఠించండి .. అన్ని సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

మకర రాశి :  కుజుడు.. శని మధ్య శుభ యోగం ఏ ర్పడటం వలన ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి.  కొత్త కాంట్రాక్ట్​లు వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రమోషన్​.. వేతనం పెరగడం.. అవార్డులు రావడం జరిగే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.  కొత్త బ్రాంచ్​ లు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి:  రెండు అత్యంత శక్తివంతమైన గ్రహాలు కలయిక వలన ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తవుతాయి.  తోటి ఉద్యోగుల సహకారంతో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు.  గతంలో చేపట్టిన ప్రాజెక్ట్​ వర్క్​లో వి.యం సాధిస్తారు.  ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆర్థికంగా స్థిరత్వం పొందే అవకాశాలున్నాయి.  వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి.  కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకొనే వారికి ఇది చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. 

మీనరాశి:  శని.. కుజుడు.. 60 డిగ్రీల దూరంలో సంచారం  వలన ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.  ఉద్యోగస్తుల విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకొనే నిర్ణయం కెరీర్​ విషయంలో లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశాలున్నాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.