నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. 138 మంది విద్యార్థులు 690 మార్కులకు పైగా స్కోర్ చేశారు. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సాల్ 715 మార్కులతో నీట్ రీఎగ్జామ్ ఫలితాల్లో టాప్లో నిలిచారు. నీట్ ఫలితాల్లో సత్తా చాటిన 138 మంది విద్యార్థుల్లో దాదాపు 93 శాతానికి పైగా మొదటి సారి నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులేనని NTA వెల్లడించింది. వారిలో దాదాపు అందరూ 17 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులేనని తెలిపింది.
NTA Declares Result of NEET (UG) 2026
— National Testing Agency (@NTA_Exams) July 16, 2026
11.21 lakh candidates qualify;
Results declared in time for counselling and Medical College Admissions;
Toppers from almost all States and Union Territories;
More than 58 per cent of qualified candidates are women;
Examination conducted in…
720 మార్కులకు నీట్ ఎగ్జామ్ జరిగింది. 720కి 715 అత్యధిక స్కోరును పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా మరియు హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ సంయుక్తంగా సాధించారు. 19 మంది అభ్యర్థులు 700 మార్కులకు పైగా సాధించారని NTA తెలిపింది. 138 మంది అభ్యర్థులు 690 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 1,492 మంది అభ్యర్థులు 650 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించారు.
10,160 మంది అభ్యర్థులు 600 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. 90,780 మంది అభ్యర్థులు 500 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. యూపీ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 17 మంది టాపర్లు 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించగా, 26 మంది టాపర్లు 690 కంటే ఎక్కువ మార్కులు సాధించారని NTA తెలిపింది.
ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 1.7 లక్షలకు పైగా అభ్యర్థులు అర్హత సాధించగా, లక్షద్వీప్‌లో 43 మంది అర్హత సాధించారు. దాదాపు 20 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ కు హాజరు కావడం గమనార్హం. జూన్ 21న నీట్ రీఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ సహా 13 భాషల్లో నిర్వహించారు. నీట్ రీఎగ్జామ్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 58 శాతానికి పైగా అమ్మాయిలే సత్తా చాటడం విశేషం.
