గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో ఇంటిని రిపేర్ చేస్తుండగా పురాతన వెండి నాణేలు, బంగారం లభించినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఈ నెల 5,6 తేదీల్లో గట్టు గ్రామానికి చెందిన పురోహితుడు శ్యాంసుందర్ జోషి వాస్తులో భాగంగా ఇంటి రిపేర్ పనులను మేస్త్రీకి అప్పగించాడు. కొంత మంది కూలీలతో పనులు చేస్తుండగా, పురాతన వెండి నాణేలు, బంగారం ముక్క దొరికినట్లు డీఎస్పీ తెలిపారు. 33 పురాతన వెండి నాణేలు 9.5 గ్రాముల బంగారు ముక్కను స్వాధీనం చేసుకొని ట్రెజరీకి తరలించినట్లు చెప్పారు. ట్రెజరీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
