హైదరాబాద్ సిటీ, వెలుగు: హోటళ్లలోని ఫుడ్వేస్టేజీని పబ్లిక్‌ప్లేసుల్లో పారబోయడం, పశువుల, పందుల ఫార్మ్‌లకు తరలిస్తే సహించబోమని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. బుధవారం హబ్సిగూడ చౌరస్తాలోని సుప్రభాత్, అమరావతి హోటళ్లలో తనిఖీలు చేశారు. అమ్ముడుపోగా మిగిలిన ఫుడ్వేస్టేజీని ఏం చేస్తున్నారని ప్రశ్నించగా పశువుల, పందుల ఫార్మ్‌లకు పంపుతున్నామని చెప్పడంతో అవాక్కయ్యారు. మరికొన్ని హోటల్స్బయట పడేస్తున్నారని తెలుసుకున్నారు.
తర్వాత హబ్సిగూడ రోడ్‌నంబర్1లోని పశువుల ఫార్మ్‌కు వెళ్లి తనిఖీ చేయగా హోటళ్ల నుంచి తీసుకొచ్చిన ఆహార వ్యర్థాలను పబ్లిక్‌గా నిల్వ ఉంచి పశువులకు ఆహారంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇలా చేయడం వల్ల దుర్వాసన, కాలుష్యంతో పాటు అంటువ్యాధులు వస్తాయని అన్నారు. కార్పొరేషన్పరిధిలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్వేస్టేజీ కోసం ఇన్-సిటు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని లేదా ప్రభుత్వం గుర్తించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు మాత్రమే పంపించాలన్నార. వినకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
