రష్యా చమురు కొంటున్నందుకు.. భారత్, చైనాపై అమెరికా100శాతం టారిఫ్స్

రష్యా చమురు కొంటున్నందుకు.. భారత్, చైనాపై అమెరికా100శాతం టారిఫ్స్
  • 500 శాతం నుంచి వందకు తగ్గించి యూఎస్ సెనేటర్ల ప్రతిపాదనలు

వాషింగ్టన్: రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో సహా పలు దేశాలకు విధిస్తామన్న పన్నుల ప్రతిపాదనలను సవరిస్తూ అమెరికా సెనేటర్లు సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దివంగత (ఇటీవల మృతిచెందిన) రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ మొదట ప్రతిపాదించిన ఈ బిల్లులో.. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై మునుపు ప్రతిపాదించిన 500 శాతం పన్నుల తీవ్రతను తగ్గించారు. 

ఈ తాజా బిల్లును ఆమోదిస్తే గనక.. సదరు దేశాలపై 100 శాతం వరకు పన్నులు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌కు లభిస్తుంది. రష్యా అధికారులపై ఆంక్షలు విధించడంతో పాటు, రష్యా ఇంధనం కోసం ఆధారపడటాన్ని తగ్గించుకునేలా చైనా, భారత్‌‌‌‌లపై పన్నుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్‌‌‌‌పై యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడానికి ఈ ఆంక్షలు దోహదపడతాయని అమెరికా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. 

కాగా, రష్యా ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలలో చైనా, భారత్, స్లోవేకియా, హంగేరీ, అజర్‌‌‌‌బైజాన్ ఉన్నాయి. అలాగే రష్యా సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం ఉన్నాయి. అయితే, రష్యా నుంచి గ్యాస్‌‌‌‌ను కొనుగోలు చేస్తున్న 15 యూరోపియన్ దేశాలకు మాత్రం ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చింది.