పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్..సంగారెడ్డి జిల్లా చిట్కుల్ లో చెక్కులు పంపిణి

 పేదలకు కొండంత అండ సీఎంఆర్ఎఫ్..సంగారెడ్డి జిల్లా చిట్కుల్ లో చెక్కులు పంపిణి
  •     మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌‌చెరు(గుమ్మడిదల), వెలుగు: ఆపదలో పేద కుటుంబాలకు సీఎంఆర్‌‌ఎఫ్‌‌ ఎంతో అండగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. 

బుధవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్​ ఎన్‌‌ఎంఆర్‌‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమీన్‌‌పూర్ డివిజన్‌‌కు చెందిన అనసూయకు రూ.60 వేలు, గుమ్మడిదల మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్‌‌కు రూ.47,500, చిట్కుల్ గ్రామానికి చెందిన సంగన్నగారి మహేశ్​కు రూ.60 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి వైద్యం అందక అప్పులపాలవుతున్న వారిని ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆదుకుంటోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.