ఉప్పల్, వెలుగు: ఎక్స్పైరీ మెటీరియల్‌తో క్వాలిటీ లేని ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న రామంతాపూర్‌లోని ఓ యూనిట్పై ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. లక్ష్మీనారాయణ కాలనీలోని శ్రీ లక్ష్మీ డెయిరీ ప్రొడక్ట్స్‌లో తనిఖీలు చేయగా, ఎక్స్పైరీ అయిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, ఫంగస్‌తో ఉన్న అంజీర, లేబుల్స్ లేని రా మెటీరియల్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 2 కిలోల ఫంగస్‌తో కూడిన డ్రై అంజీర, సింథటిక్ ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్, 1.5 కిలోల లూజ్ ఫ్రూటీ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నిర్వాహకుడు ఎం.రమేశ్‌ను అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
