హైదరాబాద్, వెలుగు: ఓపెన్ ఫుట్‌వేర్ బ్రాండ్ చుప్స్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది. అధికారిక ఫుట్‌వేర్ రికవరీ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. చుప్స్ ఫుట్‌వేర్ వ్యవస్థాపకుడు యశేష్ ముఖి, కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ విషయాన్ని ప్రకటించారు. సుదీర్ఘ సమయం శిక్షణ తర్వాత క్రీడాకారుల రికవరీ ప్రక్రియకు అవసరమైన సౌకర్యవంతమైన, కుషనింగ్ కలిగిన ఫుట్వేర్డెవలప్మెంట్పై ఈ సంస్థ దృష్టి పెట్టనుంది. ఆన్-గ్రౌండ్ బ్రాండింగ్, అథ్లెట్ కథనాలతో కూడిన డిజిటల్ కంటెంట్ వంటి కార్యక్రమాలను కూడా చేపడతారు.
