దశాబ్ధాల కలలు సాకారం : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దశాబ్ధాల కలలు సాకారం : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

గ్రేటర్​ వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)​, వెలుగు: వరంగల్​ జిల్లా మామునూరు విమానాశ్రయం, అండర్​ డ్రైనేజీ కలలు సాకారం అవుతున్నాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 

బుధవారం హనుమకొండలోని కాంగ్రెస్ ఆఫీస్​లో వారు డీసీసీ అధ్యక్షులు మహ్మద్ ఆయూబ్, వెంకట్రామ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, జీడబ్ల్యూఎంసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​కార్మికులతో ఎమ్మెల్యే నాయిని మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.​​